YSRCP MP Mithun Reddy arrested: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసింది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టును ఖండించారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది… లిక్కర్ స్కాం పేరుతో అభూత కల్పనలు సృష్టించి అధికారులను బెదిరిస్తూ అక్రమ కేసులు కట్టిస్తున్నారని పేర్కొన్నారు.
మిధున్ రెడ్డిని కటకటాల పాలు చేసి తద్వారా వైసిపి కేడర్ను భయపెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు. అంత అభూత కల్పనే తప్ప స్కాం లేదని ప్రజలు తెలుసుకుంటారన్నారు. అక్రమ అరెస్టులతో ఎవరు బెదిరే పరిస్థితి లేదు, మిధున్ రెడ్డి కడిగిన ముత్యంల బయటకు వస్తాడు… పెద్దిరెడ్డి కుటుంబానికి వైసీపీ క్యాడర్ మొత్తం అండగా ఉంటుందని పేర్కొన్నారు.