ఇవాళ, రేపు మద్యం దుకాణాలు బంద్ !

-

తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాదులో రెండు రోజులపాటు లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి. ఇవాళ అలాగే రేపు రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరంలో ఇవాళ అలాగే రేపు బోనాల పండుగ జరగనుంది.

Liquor shops closed today and tomorrow
Liquor shops closed today and tomorrow

ఈ నేపథ్యంలో ఇప్పటికే సోమవారం అధికారిక హాలిడే కూడా ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ రేపు మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు సందర్భంగా ఈ నెల 21న అంటే సోమవారం రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించారు. దింతో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఉండబోతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలలో సోమవారం లిక్కర్ షాపులు కూడా మూసివేస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు హాలిడే వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news