ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా.. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కూడా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో నిన్న సిట్ ప్రిలిమినరీ చార్జి షీట్ దాఖలు.

అందులో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు పలు చోట్ల ప్రస్తావించినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే ఆయనను నిందితుడిగా చేర్చలేదని పేర్కొన్నాయి ఆ పత్రికలు. కొత్తగా మరో 8 మందిని నిందితులుగా…. చేర్చింది సిట్. వీరందరూ జగన్ మోహన్ రెడ్డికి పరిచయస్తులు అని చెప్పినట్లు తెలిపాయి పత్రికలు. 35 పేజీలు అలాగే 70 వాల్యూమ్స్ లో ఈ చార్జ్ షీట్ ఉన్నట్లు సమాచారం అందుతుంది.