యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు అలెర్ట్. యాదగిరిగుట్ట లో కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమలలోని ‘శ్రీవాణి ట్రస్ట్’ తరహాలో యాదగిరి గుట్టలోనూ ‘గరుడ ట్రస్ట్’ ఏర్పాటు కానున్నట్లు ఆలయ ఈవో వెంకట్‌రావు వెల్లడించారు. గరుడ టికెట్ ధర రూ.5వేలుగా నిర్ణయించారు.

గరుడ టికెట్ తీసుకున్న భక్తుడికి ఉదయం సుప్రభాతసేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకు.. ఎప్పుడైనా గర్భాలయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. దీనికి సంబంధించిన ప్రపోజల్స్ రెడీ చేసి ప్రభుత్వానికి పంపించారు.