ఏపీలోని రైతులకు శుభవార్త అందజేసింది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో కొంతమంది రైతుల పేర్లు లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ జాబితాలో పేరు లేని రైతులు ఈనెల 23వ తేదీ వరకు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్ లో వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 2 వేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 5 వేలు త్వరలోనే రైతుల ఖాతాలో జమ కానున్నాయి. దీంతో లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేని రైతులు మరోసారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అనేక రకాల పథకాలను తీసుకువస్తున్నారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తమ వంతు సహాయంగా కొంత డబ్బులను అందజేస్తోంది.