టిడిపిలో విషాదం నెలకొంది.. 2024 ఎన్నికల సమయంలో పిన్నెల్లిని ఎదిరించిన సీనియర్ నాయకులు మృతి చెందారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్ గ్రామానికి చెందిన టిడిపి నేత నంబూరి శేషగిరిరావు మృతి చెందారు. శేషగిరిరావు మృతి పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

2024 సాధారణ ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ లోని ఓ బూత్ లో వైసిపి నేతలు సాధించిన విద్వాంసానికి శేషగిరి రావు ఎదురొడ్డి నిలిచారని గుర్తు చేసుకున్నారు. శేషగిరిరావు కుటుంబానికి మంత్రి నారా లోకేష్ తో పాటు మరికొంతమంది టిడిపి నేతలు సంతాపం వ్యక్తం చేశారు.