నేటి కాలంలో ఎక్కడికి వెళ్లినా ఫోన్ తోనే పని డబ్బులు ఎవరు వెంట తీసుకెళ్లడం లేదు. ఫోన్ తో స్కాన్ చేసి డబ్బులు చెల్లించడం అలవాటు అయిపోయింది. ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు ఫోన్లలోనే స్కాన్ చేసే డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ పోస్టాఫీసుల్లో అలా కుదిరేది కాదు. తప్పనిసరిగా నగదు మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. ఇక

నుంచి అలాంటి ఇబ్బందులు ఎత్తకుండా రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 32 ప్రధాన, 689 సబ్, 5,006 బ్రాంచి పోస్ట్ ఆఫీస్ లో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా యూపీఐ సేవలో పోస్ట్ ఆఫీసుల్లో ఆగస్టు నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో పోస్టాఫీసుల్లో నగదు చెల్లించేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.