బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి షాక్ తగిలిందనే చెప్పాలి. శుక్రవారతం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లనే నోటికొచ్చినట్టు మాట్లాడితే.. నువ్వు ఎవ్వరితో తిరిగావో ఆ 16 మంది పేర్లు బయటపెడతా.. నువ్వు జూబ్లీహిల్స్ లో ఎక్కడ పడుకున్నావో, దుబాయ్ లో ఎక్కడ పడుకున్నావో, ఢిల్లీలో ఎక్కడ పడుకున్నావో నాకు అన్ని తెలుసు.. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాను. నీ స్టోరీలు అన్నీ నాకు తెలుసు. మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. తనవి ఆరోపణలు కాదు వాస్తవాలు” అని కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో వీడియోలతో సహా ప్రూప్స్ ఇచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో రాజేంద్ర నగర్ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అనుంబంధ విద్యాసంస్థ NSUI నేతలు కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు.