ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్త పేర్కొన్నారు. ఆయన ఎదుట ఇవాళ పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కొందరూ కీలక సభ్యులు కూడా ఉన్నారు. రాష్గ్రానికి చెందిన 21 వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా ఉన్నారు. వారంతా వచ్చే మార్చి వరకు లొంగిపోవాలని కోరారు. హ్యాండ్ గ్రనేడ్లు, రైఫిల్స్, ఏకే-47 వంటి భారీ ఆయుధాల డంప్ ను స్వాధీనం చేసుకున్నారు.
పలువురు మావోయిస్టులు శనివారం ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్త ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో రామకృష్ణ, అరుణ ఉన్నారని పేర్కొన్నారు. ఏవోబీ పరిధిలో భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు. ఏకే47, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయన్నారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడూ సమాచారం అందుకొని జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 21 మంది ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ వంటి పలు రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా పని చేస్తున్నారని.. మావోయిస్టులందరూ జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసారు.