జైపాల్ రెడ్డికి సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప.. వ్యక్తిగతం ఉండదు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డును ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి విచ్చేసి మాట్లాడారు. బెస్ట్ పార్లమెంటరీయన్ అవార్డు సౌత్ ఇండియాలో మొదటి వ్యక్తిగా జైపాల్ రెడ్డికే వరించింది. పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి చట్ట సభల్లో గౌరవాన్ని తీసుకొచ్చారు. దేశ రాజకీయాలల్లో ముద్ర పరిచిన జైపాల్ రెడ్డి అవార్డులు అందుకుంటున్న మోహన్ గురుస్వామికి ఇవ్వడం గొప్ప విషయం అన్నారు.
పీవీ నరసింహారావు తరువాత ఆ గుర్తింపు తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి అని కొనియాడారు. ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాారు. కానీ జైపాల్ రెడ్డి లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదన్నారు. సుష్మ స్వరాజ్ చర్చ లేకుండానే పార్లమెంట్ లో బిల్లును ఆమోదించడంలో కీలక పాత్ర పోషించారు. వాజ్ పేయి, సుష్మ స్వరాజ్ వంటి వారితో కూడా స్నేహంగా ఉన్నారు జైపాల్ రెడ్డి.