హిందూ ప్రజలకు శ్రావణమాసం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ నెలలో ప్రతిరోజు ఎంతో విశేషమైనది. ఈ నెలలో స్త్రీలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే శ్రావణమాసంలో వివిధ రకాల నోములను వ్రతాలను పూజలను, చేస్తూ స్త్రీలు భక్తిశ్రద్ధలతో దేవుళ్ళని కొలుస్తుంటారు. ఇక శ్రావణమాసం ఎంతో పవిత్రమైనది కావున ఈ మాసంలో స్త్రీలు కొన్ని పనులను చేయకూడదు ఆ పనులు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రావణమాసం హిందూ సాంప్రదాయాల్లోనే ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో శివుడు,విష్ణువును, లక్ష్మీదేవి వంటి దేవతలను పూజించడం ఆచారంగా వస్తుంది. ఈ మాసంలో స్త్రీలు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి.ఈ నిషిద్ధ పనులను నివారించడం వలన ఆధ్యాత్మికంగా శాంతిని,సంపదను, ఆరోగ్యాన్ని, పొందవచ్చు.
శ్రావణమాసంలో మాంసాహారం మద్యపానం పూర్తిగా నిషేధించాలి. ఈ మాసం లో సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి. అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తమస గుణాలను కలిగి ఉన్న ఆహారాలను తినకూడదు.
ఇక ఈ మాసంలో అబద్ధాలు ఆడడం, ఇతరులను బాధ పెట్టే చర్యలను మానుకోవాలి. కోపం ద్వేషం వంటి వాటి వల్ల మానసికంగా మన పవిత్రతను దెబ్బతీస్తాయి. మనలో ఒకరి పట్ల ద్వేషం, కోపం ఉంటే మనం దేవుడి దగ్గర ప్రశాంతంగా కూర్చుని పూజ చేయడం కుదరదు కాబట్టి వీటికి దూరంగా ఉండమని శాస్త్రం చెబుతుంది.
అలాగే ఈ మాసంలో జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం గడ్డం గీయడం వంటి పనులను మానుకోవాలి. ఇవి మన అందం పైన దృష్టి పెడతాయి కాబట్టి అలాంటి పనులను వాయిదా వేయడం మంచిది.
ఇక శ్రావణమాసంలో దీపారాధన చేయడం స్రీలు ముఖ్యమైన పనిగా భావిస్తారు అలాంటి దీపారాధన చేసే సమయంలో జుట్టు జడ వేయకుండా, వదిలేసిపూజ చేయడం శాస్త్ర ప్రకారం నిషేధం. మనం ఇప్పుడున్న బిజీ లైఫ్ లో, తొందరగా పూజను కూడా ముగించుకొని, ఆఫీసులకు వెళుతూ ఉంటాం. అలాంటి టైం లో తలస్నానం చేసి జడ వేసుకోకుండానే జుట్టు విరబోసుకొని దీపారాధన కొంతమంది చేస్తూ ఉంటారు అలాంటి పొరపాటును ఈ మాసంలో చేయకూడదు.