భారత్ యుద్ధ దేశం కాదు.. బుద్ద దేశం : ప్రధాని మోడీ

-

భారత్ యుద్ధ దేశం కాదు.. బుద్ద దేశం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తాజాగా లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ గురించి చర్చ సందర్భంగా మాట్లాడారు. ఆయుధపరంగా ఎంత పటిష్టంగా ఉన్నా శఆంతి కోసమే ప్రయత్నిస్తామని ప్రధాని వెల్లడించారు. దేశం సురక్షితంగా ఉన్నప్పుడే విజ్ఞానపరంగా అభివృద్ధి చెందుతామని వ్యాఖ్యానించారు. భారత ఆయుధాలకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. రక్షణ రంగంలో ప్రైవేట్ కి తలుపులు తెరిచామని.. రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు గత 11 ఏళ్లలో 30 రెట్లు పెరిగాయని తెలిపారు. 

pm modi

నెహ్రు చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది. పాకిస్తాన్ కి కాంగ్రెస్ నీళ్లు అప్పగించి సంకట స్థితి తీసుకొచ్చింది. నెహ్రు-పాక్ అనుకూలతతో మన రైతులు ఇబ్బందులు పడ్డారు. నది మనది.. కానీ నీళ్లు మనవి కాదు.. పీవోకేను ఎప్పుడు వెనక్కి తీసుకొస్తారని కొందరూ అడుగుతున్నారని పేర్కొన్నారు. సింధూ ఒప్పందం లేకుంటే భారీ ప్రాజెక్టులు వచ్చేవి. నీళ్లే కాదు.. కాలువలు త్రవ్వేందుకు కూడా పాక్ కి నిధులు ఇచ్చారు జవహర్ లాల్ నెహ్రు అని గుర్తు చేశారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news