రష్యాలోని తూర్ెపు కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. రాబోయే మూడు గంటల్లో రష్యా, జపాన్ తీర ప్రాంతాలకు విధ్వంసక సునామీ అలలు చేరుకోవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. భూకంప ప్రభావిత ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. భూకంప తీవ్రతకు భవనాల లోపల జరిగిన కంపనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భూకంపం సంభవించిన సమయంలో అపార్ట్ మెంట్ లోని ఫర్నిచర్ తీవ్రంగా ఊగిపోవడాన్ని గమనించవచ్చు.
ముఖ్యంగా భూ ప్రకంపనల తీవ్రత కు సునామీ ఏర్పడి సముద్రం ఉప్పొంగిది. 3, 4 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో సివెరో-కురిల్క్స్ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ బిల్డింగ్ అలల తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయింది. మరోవైపు రష్యాతో పాటు జపాన్, యూఎస్ లోని హవాయి తీర ప్రాంతాల్లో అధికారులు సైరన్ల ను మోగిస్తూ సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే యూఎస్ లోని అలాస్కా, జపాన్ లోని పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.