Heartbreaking video Old woman: పెన్షన్ కోసం ఓ వృద్ధురాలి తిప్పలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుండెల్ని పిండేసేలా ఈ వీడియో ఉండడంతో జనాలందరూ… ఎమోషనల్ అవుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న తనకు సహాయం చేసే వారు లేక…. పూర్తి సహాయంతో వృద్ధురాలు నడిచింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కేంద్రంలో ఈ హృదయ విధారక సంఘటన తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ భావోద్వేగం చెందుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రత్యామ్నాయ మార్గం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
గుండెల్ని పిండేసే వీడియో.. పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు
నడవలేని స్థితిలో ఉన్న తనని సాయం చేసేవారు లేక.. కుర్చీ సహాయంతో వెళ్లిన వృద్ధురాలు
సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు మండల కేంద్రంలో వెలుగు చూసిన హృదయవిదారక ఘటన
సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో.. వృద్ధురాలి దీనస్థితి చూసి… pic.twitter.com/VFF5MRBxcu
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 1, 2025