తెలంగాణలో పేద కుటుంబాలకు ఆహార భద్రతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా రేషన్ కార్డుదారులకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోలు చెప్పిన ఉచిత బియ్యం అందించబడుతుంది ఈ పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన దేశవ్యాప్తంగా ఆహార భద్రత కల్పించడం, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆహార ధాన్యాలు ఉచితంగా అందించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. కరోనా టైంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న 2025న ఉచిత సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పేదవారికి ఒక వ్యక్తికి నెలకు 6 కిలోలు చొప్పున సన్న బియాన్ని అందిస్తున్నారు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఆరుగురు వ్యక్తులు ఉన్నారనుకుంటే ఆరు కిలోలు చొప్పున నెలకు 36 కిలోల సన్నబియ్యాన్ని ఆ కుటుంబానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నాయి. బియ్యం పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటారూ. 10, 666 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు.
పథకం కు అర్హతలు: ఈ పథకం కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఉచిత బియ్యం పొందడానికి అర్హులు. తెలంగాణలో ప్రస్తుతం 91.19 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి దీని ద్వారా దాదాపు 2.82 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు. అత్యోదయ అన్నా యోజన కార్డు దారులు. కొత్తగా జారీ చేయబడిన రేషన్ కార్డుదారులు ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు.
బియ్యం పంపిణీ ఇలా: ఒక్కో రేషన్ కార్డుపై ఒకరికి నెలకు 6 కిలోల బియ్యం ఉచితంగా అందించబడుతుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఆరుగురు సభ్యులకు ఈ బియ్యాన్ని అందజేస్తారు. ఒక కుటుంబానికి నెలకు గరిష్టంగా 36 కిలోల బియ్యం లభిస్తుంది. రేషన్ షాపులు ద్వారా ఈ బియ్యం పంపిణీ చేస్తున్నారు.
దరఖాస్తు ఇలా : బియ్యం పథకం ప్రయోజనాలు పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను. ఈ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద ఉచిత బియ్యాన్ని అందిస్తారు. రేషన్ కార్డు లేని వారు సమీపంలోని మీసేవ కేంద్రాలలో దరఖాస్తు ఫారం ను తీసుకొని దాన్ని ఫిల్ చేసి, అవసరమైన పత్రాలతో ఫారంను సమీపంలోని మండల కేంద్రాల్లో సమర్పించాలి. దరఖాస్తు వివరాలు అధికారులు పరిశీలించి అర్హత వున్న కుటుంబాలకు రేషన్ కార్డును జారీ చేస్తారు.