సాధారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి ఆలయం ప్రస్తుతం కాస్త భక్తుల రద్దీ తాకింది. ఇవాళ శనివారం అయినప్పటికీ భక్తుల రద్దీ తగ్గడం గమనార్హం. ముఖ్యంగా రైతులు అందరూ పంట పొలాల్లో బిజీగా ఉండటంతోనే భక్తుల రద్దీ తగ్గినట్టు తెలుస్తోంది. శ్రావణమాసంలో ఎక్కువగా శ్రీవారిని దర్శించుకుంటారు. కానీ ఈ సారి భక్తుల తాకిడి తక్కువగానే ఉంది.
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం మాత్రమే పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్టు వెల్లడించింది. అటు శ్రావణ శనివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శ్రీ వేంకటేశ్వర ఆలయాలు అన్నీ రద్దీగా మారాయి. దీంతో తిరుమలకి రద్దీ తగ్గింది. భక్తులు ఇవాళ తెల్లవారుజామున నుంచి ప్రత్యేక పూజలు చేస్తూ స్వామి వారి సేవలో తరిస్తున్నారు.