భారతీయ సాంప్రదాయంలో పెళ్లయిన తర్వాత భార్య భర్తకు ఎడమ వైపు కూర్చోవాలని, ఎడమవైపు నిలబడాలని చెబుతుంటారు. ముఖ్యం గా ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు భార్య భర్తకు ఎడమవైపు మాత్రమే కూర్చోవాలి అని అంటారు. అందుకు కారణం ఎప్పుడైనా ఆలోచించారా.. ఇలా చెప్పడానికి ఆధ్యాత్మిక, వైజ్ఞానిక దృక్పథంలో కొన్ని కారణాలు ముడిపడి ఉన్నాయి మరి ఆ విషయాలను తెలుసుకుందాం..
ఆధ్యాత్మిక కారణం: హిందూ సంప్రదాయంలో శరీరంలో ఎడమ భాగం శ్రీ శక్తికి ప్రతీకగా భావిస్తారు. కుడిభాగం పురుష శక్తికి సంకేతంగా భావిస్తారు. అయితే పురుష శక్తిని శివస్వరూపంగా చెబుతారు. భార్య ఎడం వైపు కూర్చోవడం ద్వారా శివస్వరూపానికి శక్తి వస్తుందని నమ్ముతారు. భర్త పక్కన భార్య ఎడమ వైపు కూర్చోవడం వల్ల భర్తకు శక్తి స్వరూపంగా మారుతుందని హిందూ సంప్రదాయంలో నమ్ముతారు. అర్ధనారీశ్వర స్వరూపం అంటే శివుడు మరియు పార్వతి సగం సగం కలిసిన రూపం ఈ సాంప్రదాయానికి ప్రతీకగా చూపిస్తారు.
సాంస్కృతిక కోణం: భారత సాంప్రదాయంలో ఎన్నో పురాణాలు, ఎంతో ప్రాముఖ్యత చెందినవి మనం చూశాం. ఉదాహరణకు రామాయణం, మహాభారతం, లాంటి పురాణాలు ఎన్నో చదివాం. ఆ పురాణాల ప్రకారం సీతాదేవి శ్రీరాముడికి ఎడమవైపు, రాధా శ్రీకృష్ణుడికి ఎడమవైపు ఉండేవారని చెబుతుంటారు. ఈ సాంప్రదాయం దంపతుల మధ్య సమానత్వం పరస్పర గౌరవాన్ని సూచిస్తుంది. భారతీయ సంస్కృతిలో భార్య భర్తకు ఎడం వైపు కూర్చోవడం అనేది ఆమె సమాన భాగస్వామి అని చెప్పడానికి సంకేతంగా భావిస్తారు.
వైజ్ఞానిక కోణం : వైద్యపరంగా చూస్తే ఎడమవైపు కుడి శరీర భాగాలు మెదడు వివిధ హేమిస్ఫియర్ ద్వారా నియంత్రించబడతాయి.కుడి హేమిస్ఫియర్ శరీరం యొక్క ఎడమ భాగాన్ని నియంత్రిస్తుంది, ఇది భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటుంది. భార్య ఎడమవైపు కూర్చోవడం ద్వారా, ఆమె భావోద్వేగ సమానత్వం,సపోర్ట్ భర్తకు అందిస్తుందని భావిస్తారు.
భార్య భర్తకు ఎడమవైపు కూర్చోడం అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఎంతో లోతైన అర్థం దాగి ఉంది భార్య భర్తకు ఎడమవైపు ఉండడం అనేది భర్త యొక్క హృదయానికి దగ్గరగా ఉండడం. ఇది దంపతుల మధ్య సమానత్వం,గౌరవాన్ని ప్రతిపాదిస్తుంది.