పూర్తి అక్రమాలకు కారణం అప్పటి సీఎం కేసీఆరే అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పీసీ ఘోష్ కమిటీ నివేదికలో ఆయన కొన్ని విషయాలను మీడియాకి వివరించారు. పలు సందర్భాల్లో నిపుణుల కమిటీ నివేదిక ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని కేసీఆర్ అప్పట్లో అసెంబ్లీలో ప్రకటించారు. కానీ నిపుణుల నివేదికను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ప్రజలను అసెంబ్లీని కేసీఆర్ తప్పుదోవ పట్టించారు. నిపుణుల కమిటీ నివేదికను కేసీఆర్, హరీశ్ రావు పట్టించుకోలేదు అన్నారు.
మూడు బ్యారేజీల దుస్థితికి కారణం కేసీఆర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణకు ప్రయోజనం లేదని.. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి తీసుకున్న లోన్లకు 2024 సెప్టెంబర్ నాటికే రూ.29వేల కోట్ల వడ్డీ భారం పడిందని తెలిపారు. ప్రస్తుతం రూ.41వేల కోట్ల వడ్డీ, 64వేల కోట్ల రుణంతో కలిపి నిరుపయోగం ప్రాజెక్ట్ తో ప్రజలకు 1.05 లక్షల కోట్ల భారం ఉందని వెల్లడించారు.