తుమ్మిడిహట్టి వద్ద వాటర్ లేక ప్లేస్ మార్చరనేది అబద్దం : మంత్రి ఉత్తమ్ కుమార్

-

తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్లనే ఆ నిర్మాణాన్ని మేడిగడ్డకు మార్చినట్టు కేసీఆర్ అబద్ధం చెప్పారని ఉత్తమ్ పేర్కొన్నారు. తుమ్మడి హట్టి వద్ద నీళ్లు ఉన్నాయని నాటి కేంద్ర జలమంత్రి ఉమా భారత్ పేర్కొన్నా.. కేసీఆర్ పట్టించుకోలేదని పీసీ ఘోష్ కమిషన్ గుర్తించిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీ సూచించినా గత ప్రభుత్వ పెద్దలు వినలేదని రిపోర్టులో స్పష్టం చేశారని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Uttam Kumar Reddy

కేసీఆర్ డిజైన్లు మార్చడంతో ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు ఘోష్ కమిషన్ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లోనే సమస్య ఉంది. రుణాలు తీసుకోవడంలోనూ కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డారు. ఘోష్ కమిషన్ 605 పేజీల నివేదిక ఇచ్చింది. ఇందులో హరీశ్ రావు ప్రస్తావన 9సార్లు ఉందని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. ఘోష్ కమిషన్ రిపోర్టులోని పలు అంశాలను వివరించారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ నిర్మించాలని గతంలో నిర్ణయించారని.. కేసీఆర్ సీఎం అయ్యాక దానిని మేడిగడ్డకు మార్చారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news