ములుగు–వరంగల్ రహదారిపై పెను ప్రమాదం నెలకొంది. ములుగు–వరంగల్ రహదారిపై బ్రిడ్జి కుప్పకూలింది. దింతో రాకపోకలు స్తంభించాయి. ములుగు–వరంగల్ రహదారిపై బ్రిడ్జి కుప్పకూలడంతో వాహనాల దారి మళ్లింపు చేశారు. ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద 163 ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలడంతో నిలిచిపోయాయి రాకపోకలు.

కూలిన వంతెన పక్కనే నిర్మిస్తున్న కొత్త వంతెన పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని ఆరోపిస్తున్నారు స్థానికులు. పాత వంతెనకు సపోర్టుగా ఉన్న మట్టిని జేసీబీతో ఇష్టారాజ్యంగా తొడడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, వంతెన ప్రమాదస్థాయిలో ఉందని ఎన్ని సార్లు చెప్పినా ఇంజనీర్లు ఎవరూ పట్టించుకోలేదని వాపోతున్నారు స్థానిక ప్రజలు. ఇక ములుగు–వరంగల్ రహదారిపై బ్రిడ్జి కుప్పకూలిన వీడియో వైరల్ గా మారింది.
ములుగు–వరంగల్ రహదారిపై కూలిన బ్రిడ్జి
స్తంభించిన రాకపోకలు.. వాహనాల దారి మళ్లింపు
ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద 163 ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలడంతో నిలిచిపోయిన రాకపోకలు
కూలిన వంతెన పక్కనే నిర్మిస్తున్న కొత్త వంతెన పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని ఆరోపిస్తున్న… pic.twitter.com/AuoOuuLhGs
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2025