హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార-1 సినిమా నుంచి హీరోయిన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “కనకవతిని పరిచయం చేస్తున్నాం” అంటూ హీరోయిన్ రుక్మిణి వసంత్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. రాణిగా రుక్మిణి వసంత్ ఎంతో అందంగా ఉందని ఫోటో చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. హోంభలే ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కాంతార-1 సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.
ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని కోరుతున్నారు. కాగా, రుక్మిణి వసంత్ ప్రస్తుతం వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన అభిమానుల ముందుకు వస్తూనే ఉన్న ఈ చిన్నది వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ చిన్నదానికి విపరీతంగా అభిమానులు పెరుగుతుండడం విశేషం. తనదైన నటన, అందచందాలతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది.