ప్రమాదంలో సింగూరు ప్రాజెక్టు..ఏ క్షణమైనా కట్టకు గండిపడే ప్రమాదం !

-

ప్రమాదంలో సింగూరు ప్రాజెక్టు ఉంది. సింగూరు భద్రతపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఆందోళన నెలకొంది. ఏ క్షణమైనా కట్టకు గండిపడే ప్రమాదం ఉందని అంటున్నారు. డ్యామ్ ఎగువ భాగంలో దెబ్బతిన్న రివిట్ మెంట్ కి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు అధికారులు.

singur
Dam Safety Review Panel concerned about Singur safety

ఈ ఏడాది జూన్ 23న ప్రాజెక్టును పరిశీలించింది DSRP కమిటీ. సింగూరు ప్రాజెక్టు దెబ్బతినడానికి సామర్ధ్యానికి మించి నీటిని నిల్వ చేయడమేనని నిర్థారించారు కమిటీ. 517 మీటర్ల నీటి నిల్వకు వీలుగా 1976లో ప్రాజెక్టు నిర్మాణం చేశారు. మిషన్ భగీరథ అవసరాల కోసం నీటి సామర్ధ్యాన్ని 520 మీటర్లకు అనుమతిస్తూ 2017లో జీవో ఇచ్చింది గత ప్రభుత్వం. ఒక్కోసారి 522 మీటర్ల వరకు కూడా నీటిని స్టోర్ చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news