తెలంగాణ రాష్ట్ర తోలి సీఎం కేసీఆర్ కు రాఖీ కట్టారు సోదరీ మణులు. రాఖీ పూర్ణిమ సందర్భంగా కేసీఆర్ కు అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీ కట్టారు. ప్రతి సంవత్సరం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు.. రాఖీ పౌర్ణమి సందర్భంగా.. ఆయనకు సోదరీమణులు రాఖీలు కడుతూనే ఉంటారు. ఇది ఇలా ఉండగా… రాఖీ పౌర్ణమి సందర్భంగా కల్వకుంట్ల కవిత.. మాత్రం కేసీఆర్ ఇంటికి రాలేదు.

తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే సోదరుడు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు రాఖీ మాత్రం కట్టలేదు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ కుటుంబానికి కల్వకుంట్ల కవిత దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దూరం.. మరింత పెరిగిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందుకే కేసిఆర్ అలాగే కేటీఆర్ లకు రాఖీ కట్టేందుకు కల్వకుంట్ల కవిత రాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. అందుకే కల్వకుంట్ల కవిత రాలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆయనకైనా కవిత రాఖీలు కట్టాల్సిందని అంటున్నారు. కెసిఆర్ సోదరీమణులు రాఖీలు కట్టారు కానీ కూతురుగా కవిత మాత్రం రాలేదు.