ఏపీలో కొత్త జిల్లాల మార్పులకు సంబంధించి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఏపీలో జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ఉన్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశంలోకి మార్పు చేయనున్నారు.

కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు ఏర్పడే అవకాశం ఉందట. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పాలనా సౌలభ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిపై ఇప్పటికే కమిటీ అధ్యయనం చేస్తోంది.
- ఏపీలో కొత్త జిల్లాల మార్పులకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు
- జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం
- కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచన
- అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశంలోకి మార్పు
- కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు ఏర్పడే అవకాశం