ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై కూడా కేసు నమోదు అయింది. దీంతో రవీంద్రనాథ్ రెడ్డి కొత్త చిక్కుల్లో పడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వ్యాఖ్యలు చేశారని జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు.

ఈ తరుణంలో విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు బుక్ చేశారు. ఇక ఈ కేసు విషయంలో… జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి నోటీసులు కూడా జారీ అయ్యే ఛాన్స్ లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై ఇప్పటివరకు వైసీపీ పార్టీ నేతలు ఎక్కడ స్పందించలేదు. ఇవాళ సాయంత్రం లోపు జగన్ మోహన్ రెడ్డి బృందం నుంచి ఎవరో ఒకరు స్పందించే ఛాన్స్ ఉన్నాయి.