ఈరోజుల లో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య భయం, ఆందోళన. వీటి వలన నిద్రలేమి (ఇన్సోమ్నియా) వ్యాధితో బాధపడుతున్నారు. ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ సమస్యకు గల కారణాలను అర్థం చేసుకోవడం వలన వాటిని నివారించడానికి తగిన చర్యలను తీసుకోవచ్చు. భయం, ఆందోళన నిద్రలేమి సమస్యలకు గల కారణాలు వాటి నివారణ చర్యలను క్లుప్తంగా తెలుసుకుందాం..
భయం ,ఆందోళన: ఒక వ్యక్తి జీవించే విధానం ఎంతో ముఖ్యం. ఈ సమస్యలు కలగడానికి అనేక కారణాలు ఉండొచ్చు. శారీరక, ఆరోగ్య సమస్యలు లేదా మానసిక సమస్యల వలన భయం, ఆందోళన కలగవచ్చు. వీటి ద్వారా నిద్రలేమి సమస్య సంభవిస్తుంది. ఈ మూడు సమస్యలకు మొదటి కారణం ఒత్తిడి ఎంతోమంది వారు చేసే పని లేదా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల వలన ఒత్తిళ్ళని ఎదుర్కొంటున్నారు. ఇది ఆందోళన పెంచి భయానికి గురిచేస్తాయి. వీటి ద్వారా నిద్రలేమి సమస్య సంభవిస్తుంది.

శారీరక కారణాలు : ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఎన్నో శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు థైరాయిడ్,షుగర్,బీపీ, హార్మోన్స్ ప్రాబ్లమ్స్, వలన ఆందోళన కలిగే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. గుండె జబ్బులు, డయాబెటిస్ శ్వాసకోశ సమస్యలు, వంటి దీర్ఘకాలిక వ్యాధులు నిద్రను భంగం చేస్తాయి. కెఫిన్, ఆల్కహాల్ వంటి అలవాట్లు నిద్రలేమి సమస్యను కలుగచేస్తాయి.
ఇక ఇంతే కాకా ఈ రోజుల లో ఎక్కువ మంది మొబైల్ ఫోన్స్ కి బాగా అలవాటు పడిపోయారు. నిద్ర లేకపోవడానికి ఇది కూడా ఒక రకమైన కారణం. ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ చూడడం వలన కళ్ళ పైన ఒత్తిడి పడి నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. ఇక ఇంతే కాక పెద్దపెద్ద స్పీకర్స్, లేదా కాలుష్యం వంటివి నిద్రకూ అంతరాయం కలిగించేవి.
నివారణ చర్యలు: ముఖ్యంగా ఏదైనా ఒక వ్యాధి సంభవించడానికి మనం జీవన విధానం ఆధారపడి ఉంటుంది. ఒత్తిడి తగ్గించుకోవడం, మెడిటేషన్, డీప్ బ్రీత్ యోగా వంటి టెక్నిక్స్ తో సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా, పని ఒత్తిడిని తగ్గించవచ్చు. సరైన టైం కి నిద్రపోవడం, నిద్రపోవడానికి ముందు కాఫీ ఆల్కహాల్, వంటి అలవాట్లకు దూరంగా ఉండడం. స్క్రీన్ టైమ్ ను తగ్గించుకోవడం వలన హాయిగా నిద్ర పడుతుంది. అప్పటికి నిద్ర పట్టకపోతే ఏదైనా ఒక మంచి చిన్న పుస్తకాన్ని చదువుకోవడం అలవాటు చేసుకోండి. శబ్దాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడం అలవాటు చేసుకోండి. మంచి ఆహారాన్ని తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం,కావాల్సినంత నీరు తాగడం, ధూమపానానికి,మద్యపానాన్ని కి దూరం గా ఉంటే నిద్రలేమి సమస్య తీవ్రత తగ్గించవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, లక్షణాలు తీవ్రంగా ఉంటే సైకాలజిస్ట్ ను సంప్రదించడం ముఖ్యం.