ఏపీలో ‘వార్ 2’ సినిమా ప్రీమియర్ షో టికెట్ రేట్లు పెంచారు. రూ.500కు పెంచేందుకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం… ‘వార్ 2’ సినిమా రిలీజ్ డే రోజు ఉదయం 5 గంటల ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ డే నుంచి ఆగస్టు 23 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది.

అటు రజనీకాంత్ కూలీ సినిమా టికెట్ రేట్ల పెంచారు. అదనపు షోలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 14 నుంచి 23 వరకు సినిమా టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చింది. సింగల్ స్క్రీన్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు అదనంగా పెంచుకోవడానికి ఉత్తర్వులు ఇచ్చింది. 14వ తేదీ ఉదయం బెనిఫిట్ షో కి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.