తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. భారీ వర్షాల నేపథ్యంలో ఆగస్టు 13, 14వ తేదీల్లో హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సగం రోజు సెలవు ప్రకటించింది విద్యా శాఖ.

కాగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ అలాగే రేపు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతాయని వార్నింగ్ ఇచ్చింది. దింతో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నం అయిన సంగతి తెలిసిందే.