తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటలకు పైనే సమయం పడుతుందని టిటిడి వెల్లడించింది. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచి ఉన్నారు. మంగళవారం 77,596 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

31,565 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చినట్లుగా ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా… తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి ఉండాలని టిటిడి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ఈ నెల 15 నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. తిరుమలలో అధిక రద్దీ నివారణ, మెరుగైన భద్రత ప్రమాణాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించమని చెప్పారు. దీంతో తిరుమలకు వెళ్లే వాహనదారులు అలర్ట్ అవుతున్నారు.