తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు ఊహించని పరిణామం ఎదురైంది. కూటమి ప్రభుత్వం చేసిన పనులను ఎడ్ల బండి పై ప్రచారం చేస్తూ… సంబరాలలో పాల్గొన్న టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు కు ఊహించని పరిణామం ఎదురైంది. టిడిపి సంబరాలలో ఎడ్లు రంకెలు వేశాయి. సూపర్ సిక్స్ సూపర్ హిట్.. అన్నదాత సుఖీభవ అనగానే బెదిరిపోయాయి ఎడ్లు.

దీంతో టిడిపి ఎమ్మెల్యే కింద పడిపోయారు. ఈ నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యానంద కు తీవ్ర గాయాలు అయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో నిర్వహించిన రైతు సంబరాలలో ఎడ్లు బెదిరిపోయాయి. దీంతో కింద పడ్డ టీడీపీ కొత్తకోట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అలాగే టిడిపి నేతలకు స్వల్ప గాయాలు అయ్యాయి.
టీడీపీ సంబరాల్లో రంకెలు వేసిన ఎడ్లు
సూపర్ సిక్స్ సూపర్ హిట్, అన్నదాత సుఖీభవ అనగానే బెదిరిన ఎడ్లు.. కింద పడ్డ టీడీపీ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో నిర్వహించిన రైతు సంబరాల్లో ఎడ్లు బెదిరిపోవడంతో ఎడ్లబండిపై నుంచి కిందపడిపోయియిన టీడీపీ కొత్తపేట… pic.twitter.com/kZ2WMDcT2o
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2025