గులాబీ పార్టీకి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న కల్వకుంట్ల కవిత… మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కల్వకుంట్ల కవిత అలాగే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఒకే వివాహానికి వచ్చి ఎదురు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత ఉన్న విషయాన్ని గమనించి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు జగదీశ్వర్ రెడ్డి.

గులాబీ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్ కుమార్ కుమార్ రెడ్డి కుమార్ రెడ్డి వివాహానికి జగదీశ్వర్ రెడ్డి అలాగే కల్వకుంట్ల కవిత ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఒకరినొకరు పలకరించుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటీవల జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అటు కవిత అంశం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని… మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా వెల్లడించారు.
She who dares, wins.✌🏻
Boss 🔥 pic.twitter.com/W864AF38DP— Siddiq Shaik 🇮🇳 (@siddiqshaik87) August 13, 2025