రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు వైఎస్ జగన్. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ.. ఈ ముగ్గురూ హాట్ లైన్ టచ్‌లో ఉన్నారని ఆరోపణలు చేశారు. అందుకే.. ఏపీ గురించి రాహుల్ గాంధీ, కాంగ్రెస్సో్ళ్లు ఎప్పుడూ మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్.

రేవంత్ ద్వారా బాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉంటారు… బాబు గురించి మాణిక్యం ఠాకూర్ ఒక్కకామెంట్ ఎందుకు చేయరని ఆగ్రహించారు. ఏపీలో ఎన్నో స్కామ్ లు జరుగుతున్నాయి.. అమరావతి నిర్మాణం అని ఆరోపించారు. కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు? అంటూ నిప్పులు చెరిగారు వైఎస్ జగన్.
చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నికలు కావొచ్చు.. ఇప్పటికైనా కృష్ణా రామా అనుకుంటే పుణ్యమైన వస్తుంది, లేదంటే నరకానికి పోతావు అని షాకింగ్ కామెంట్స్ చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు నీకు దమ్ముంటే మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిపించాలని… కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించండి అని పేర్కొన్నారు.