శరీరాన్ని లోపల నుంచి నాశనం చేసే ప్రమాదకర కూరగాయలు .. జాగ్రత్త!

-

మనం కూరగాయలను సాధారణంగా ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తాం. ఎందుకంటే అవి విటమిన్స్ ఫైబర్ తో నుండి ఉంటాయి. అయితే కొన్ని కూరగాయలు అనుచితంగా తీసుకున్నప్పుడు లేదా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరానికి ఎంతో హాని కలిగిస్తాయి. ఈ కూరగాయల్లో కొన్ని సందర్భాల్లో శరీరం లోపల నుంచి నాశనం చేసే ప్రమాదకర పదార్థాలు కలిగి ఉంటాయి మరి వాటి గురించి తెలుసుకుందాం..

బంగాళదుంపలు : ప్రతి ఒక్కరూ ఇష్టపడే కూరగాయ ఏదైనా ఉందంటే అది బంగాళాదుంప చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ సులభంగా తినడానికి ఇష్టపడే కూరగాయలో బంగాళదుంప ఒకటి. మరి ఇది ప్రమాదం అని అనడానికి ఒక కారణం ఉంది బంగాళదుంప పచ్చిగా లేదా మొలకేత్తిన వాటిని తీసుకోకూడదు. బంగాళదుంప లోని సోలావిన్ అనే విషపూరిత రసాయనం ఉంటుంది. ముఖ్యంగా అవి పచ్చిగా ఉన్నప్పుడు మరియు మొలకెత్తినప్పుడు ఈ రసాయనం సూర్య కాంతికి గురై బంగాళదుంప లోపల ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు బంగాళదుంప ఆకుపచ్చ రంగుకు మారుతుంది అలాంటి వాటిని తినకూడదు. మిగిలిన బంగాళదుంపలను తినవచ్చు, ఆకుపచ్చగా మారి మొలకెత్తిన వాటిని మాత్రమే తినకూడదు.

Vegetables That Destroy Your Body from Within – Beware!

వంకాయ: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇష్టపడే కూరల్లో వంకాయ ఒకటి. ఈ కూరని ఎక్కువ మంది ఇష్టపడడానికి మరో కారణం తొందరగా వండుకోవచ్చు. మరి వంకాయని తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. అవి పచ్చిగా ఉన్నప్పుడు లేదా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ప్రమాదాలు కలగవచ్చు. వంగలోని సోలావిన్ అనే పదార్థం పచ్చిగా ఉన్నప్పుడు అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలోని జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కొంతమంది వ్యక్తులకు ఎలర్జీలు, కడుపులో మంట, నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వంకాయకు దూరంగా ఉండాలి.

మష్రూమ్స్: కొన్ని రకాల మష్రూమ్స్ శరీరం కు హాని కలిగిస్తాయి. అడవి మష్రూమ్స్ సరిగా గుర్తించని మష్రూమ్స్ లో కొన్ని రకాల పదార్థాలు విషపూరితంగా ఉంటాయి. సరిగా వండని మెష్రూమ్స్, శరీరానికి హాని కలిగిస్తాయి తీవ్రమైన వాంతులు కడుపునొప్పికి దారితీస్తాయి. అందుకే మష్రూమ్స్ ని సరిగా చూసుకొని వండడం సరిగా గుర్తించి మంచి మష్రూమ్స్ ని తీసుకోవడం చేయాలి.

సాధారణ జాగ్రత్తలు : ఏదైనా సరే వంట చేసేటప్పుడు ఒక పద్ధతిని అనుసరించి చేయడం ముఖ్యం. పచ్చిగా తినడం మానేయాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయలు పచ్చిగా తినడం అలవాటైన వారు బాగా కడిగి ఆ తర్వాత తినడం మంచిది. కూరగాయలు కొనేముందు అవి తాజాగా ఉన్నాయా లేదా అని ఒకటికి రెండుసార్లు చూసుకొని కొనుక్కోవాలి. ఏ కూరగాయనైనా అధిక మొత్తంలో తీసుకుంటే సమస్యలు తలెత్తుతాయి కాబట్టి మనకు ఎంతవరకు ఆహారం అవసరమో అంతే తీసుకోవాలి. జీవ సమస్యలు అలర్జీలు, మరేదైనా సమస్య ఒక వంటకం తిన్న తర్వాత వస్తే వెంటనే దగ్గరలో వైద్యుని సంప్రదించాలి. కూరగాయలు బాగా కడిగి సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవడం ఎంతో అవసరం.

(గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఏదైనా శారీరక సమస్య వచ్చినప్పుడు దగ్గరలో వైద్యుని సంప్రదించండి.)

Read more RELATED
Recommended to you

Latest news