బాలీవుడ్ యాక్టర్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శిల్ప అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. శిల్పా శెట్టి బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా… శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై చీటింగ్ కేసు నమోదు అయింది.

ఓ డీల్ విషయంలో రూ. 60 కోట్ల మోసానికి ఈ దంపతులు పాల్పడ్డారంటూ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ కొఠారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ విషయం పైన దర్యాప్తు చేపట్టారు. బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ 2015-2023 మధ్య అక్రమాలకు పాల్పడ్డారని దీపక్ కొఠారీ ఆరోపించారు. కాగా, రాజ్ 2021లో అశ్లీల చిత్రాల కేసులో జైలుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి శిల్పా శెట్టి, రాజ్ లతో మాట్లాడిన అనంతరం పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. శిల్పా శెట్టి రాజ్ వారు చేసిన మోసానికి ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.