పులివెందులలో జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. పులివెందులలో టీడీపీ విజయం సాధించింది. కడప జిల్లాలో కాక రేపిన పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ దక్కించుకుంది. టీడీపీకి 6,700 ఓట్లకు పైగా పోలవ్వగా.. వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే పడ్డాయి.

దీంతో 5 వేల ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 35 ఏళ్ల వైఎస్ కుటుంబ పాలనకు టీడీపీ చెక్ పెట్టింది. పులివెందుల జెడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి పార్టీ అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డి ఏకంగా 6735 ఓట్లు సంపాదించారు. ఈ నేపథ్యంలో సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అంటే ఓవరాల్ గా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి పైన 652 ఓట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టారు టిడిపి పార్టీ అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డి.