Ambati rambabu: పులివెందుల జడ్పిటిసి ఎన్నికల ఫలితాలను ఐపీఎస్ కోయ ప్రవీణ్ కు అంకితమని వైసిపి నేత అంబటి రాంబాబు తన ఎక్స్ వేదికగా సెటైర్లు పేల్చారు. రిగ్గింగ్ చేస్తున్న ఓ వీడియోను కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీనిపై టిడిపి శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ వీడియోను పులివెందులలో జరిగింది అంటూ ప్రచారం చేయడం అస్సలు సమంజసం కాదని అంటున్నారు.

ఇలాంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని సూచనలు చేస్తున్నారు. దీనిపై అంబటి రాంబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా పులివెందులలో జరిగిన జడ్పిటిసి ఎన్నికలలో టిడిపి విజయం సాధించింది. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో టిడిపి గెలవడంతో వైసిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులివెందులలో జడ్పిటిసి స్థానాన్ని మారెడ్డి లతా రెడ్డి సొంతం చేసుకున్నారు. దీంతో వైసిపి నేతలు పులివెందులలో డబ్బులు ఇచ్చి ఓట్లను కొన్నారని అంటున్నారు.
ఈ ZPTC ఎన్నికల ఫలితాలు
కోయ ప్రవీణ్ IPS కి అంకింతం ! pic.twitter.com/vU4dptyZOH— Ambati Rambabu (@AmbatiRambabu) August 14, 2025