ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొత్త పథకాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా యువత కోసం లక్ష కోట్ల నిధులను కేటాయించనున్నట్లు వెల్లడించారు.

తొలిసారి ఉద్యోగం సాధించిన వారికి 15 వేల ప్రోత్సాహం అందించబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నట్లు వివరించారు.
దీపావళి లోపు ప్రజలపై GST భారాన్ని తగ్గించనున్నట్లు ప్రకటన చేశారు. సామాన్య ప్రజలకు డబుల్ దీపావళి బొనాంజా ఇవ్వనున్నట్లు ఎర్రకోట వేదికగా ప్రకటించారు మోదీ. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ.