పులివెందుల టీడీపీ విజయంపై వైఎస్ షర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, జగన్ ఇద్దరికీ తేడా లేదని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేస్తే పులివెందులలో చంద్రబాబు అదే చేశారని మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇద్దరు కలిసి ఎన్నికల్లో ప్రజాస్వాయాన్ని ఖూనీ చేశారని నిప్పులు చెరిగారు.

ఇద్దరు కలిసి మోడీ కోసం పని చేస్తున్న వాళ్లే అన్నారు. ఒకరిది బహిరంగ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు అని పేర్కొన్నారు. ఓటు చోరీపై మోదీకి చంద్రబాబు, జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.