నటి మృనాల్ ఠాకూర్ ఇన్ స్టా వేదికగా క్షమాపణలు చెబుతూ పోస్ట్ షేర్ చేశారు. గతంలో మృనాల్ ఠాకూర్ బిపాషా బసుపై చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాటిపై తాజాగా బిపాషా బసు స్పందించారు. దీంతో నటి మృనాల్ ఠాకూర్ ఆమె పేరు ప్రస్తావించకుండానే క్షమాపణలు కోరారు. 19 ఏళ్ల వయసులో నేను తెలిసి తెలియక ఎన్నో సిల్లీ విషయాలను మాట్లాడాను.

అది ఇతరులను చాలా బాధ పెట్టాయని నాకు ఇప్పుడు అర్థమైంది అంటూ మృనాల్ అన్నారు. ఎవరిని బాడీ షేమింగ్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ నావల్ల తప్పు జరిగింది అంటూ మృణాల్ సోషల్ మీడియాలో రాసుకోచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది. మృనాల్ ఠాకూర్ బిపాషా బసుపై చేసిన కామెంట్లకు రియాక్ట్ అవుతూ ఇలా రాసుకోచ్చారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నటి మృణాల్ చాలా తొందరగా తన తప్పును తెలుసుకున్నారని తన అభిమానులు అంటున్నారు.