ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దంచికొడుతున్నాయి వానలు. తంమ్సిలో 16.7 సె.మీ వర్షపాతం పడింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 14 సె.మీ వర్షపాతం నమోదు అయింది. కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ప్రవాహం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు.

ముంపులో పలు గ్రామాలు, రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని నటరాజ్ థియేటర్ లోకి భారీగా వరద నీరు వచ్చింది. దింతో కూలీ సినిమా ప్రదర్శనను నిలిపివేసారు నిర్వాహకులు.
వరద నీటిలో సినిమా థియేటర్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
ఆదిలాబాద్ పట్టణంలోని నటరాజ్ థియేటర్ లోకి భారీగా వరద నీరు
సినిమా ప్రదర్శనను నిలిపివేసిన నిర్వాహకులు
భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో నీట మునిగి లోతట్టు ప్రాంతాలు pic.twitter.com/Zmt9SUYgHY
— BIG TV Breaking News (@bigtvtelugu) August 16, 2025