మన జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కోక తప్పదు కానీ వాటిని చూసి వెనక్కి తగ్గిపోవడం కాదు వాటిని జయించి మరింత బలంగా మారడం నేర్చుకోవాలి. కష్టాలే మనకు నిజమైన గురువులు అని తెలుసుకోవాలి. కష్టాలే మనలోని అసలు శక్తి ని బయటకు తీస్తాయి. మరి అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొన్ని ముఖ్యమైన స్టెప్స్ ని చూద్దాం..
కష్టాలను అంగీకరించండి : జీవితంలో ఎదురయ్యే సమస్యలను నివారించడం కంటే అవి సహజమని అంగీకరించడం మొదటి అడుగు అవుతుంది. అంగీకరించినప్పుడు మనసు ప్రశాంతంగా ఆలోచిస్తుంది.
పాజిటివ్ మైండ్ సెట్: ఎంత కష్టం వచ్చినా దానిలో మంచిని గుర్తించడానికి ప్రయత్నించాలి. ప్రతి సవాలు మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొస్తుంది. పాజిటివ్ ఆలోచనలు మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి. నెగిటివ్ గా ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే కష్టం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అదే పాజిటివ్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్తే కష్టాన్ని జయించడం తేలికవుతుంది.
చిన్న చిన్న లక్ష్యాలు : పెద్ద సమస్య ఒక్కసారిగా ఎదుర్కొనలేము దానిని చిన్న దశలుగా విభజించి ఒక్కొక్కటిగా పరిష్కరించాలి. ఈ చిన్న విజయాలు పెద్ద ధైర్యాన్ని కలిగిస్తాయి. మనకు వచ్చిన కష్టాన్ని ఒక్కసారిగా ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి ఆ ధైర్యం చిన్న చిన్నగా వచ్చే మన విజయాల నుంచే మనకు కలుగుతుంది.

సహనం పట్టుదల: కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చుంటే మనలో ఉండే ధైర్యం కోల్పోతాం. ఏదైనా సరే తక్షణ ఫలితాల కోసం ఆశపడకూడదు. కష్టాలను జయించడానికి సమయం కావాలి. సహనం పట్టుదల మీలో ఉంటే ఏ అడ్డంకి నైనా అధికమించవచ్చు.
అనుభవాల నేర్పు: ప్రతి కష్టం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే మనం మరింత బలంగా మారతాం అనుభవాలు మన జీవితానికి మార్గదర్శకాలుగా మారతాయి.
మొత్తం మీద కష్టాలు మనల్ని బలహీనులను చేయవు వాటిని ఎలా ఎదుర్కొంటామన్నదే మన బలం ధైర్యం, సహనం, పాజిటివ్ ఆలోచనలు కలిస్తే జీవితంలో ఎటువంటి కష్టాన్నైనా జయించగలం.