తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారంతో పోలిస్తే ఈ వారంలో చికెన్ ధరలు ఎక్కువగా పెరిగాయి. గత వారం కిలో చికెన్ ధర రూ. 220 ఉండగా ఈ వారం రూ. 230కి అమ్ముతున్నారు. పల్నాడులో చికెన్ ధర రూ. 260 రూపాయల వరకు అమ్ముతున్నారు. విజయవాడలో 240 ఉండగా 250 రూపాయలకు అమ్ముతున్నారు. గుంటూరులో రూ. 200, చిత్తూరులో రూ. 200 వరకు చికెన్ అమ్ముతున్నారు.

190 రూపాయలకు కిలో చికెన్ ఉండగా… ఈ వారం 210 రూపాయలకు అమ్ముతున్నారు. వరంగల్ లో 200, ఖమ్మంలో 210 వరకు చికెన్ ధర పలుకుతోంది. మరోవైపు శ్రావణం నిన్నటితో పూర్తికాగా ఈరోజు నుంచి చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఇక వచ్చేవారం వినాయక చవితి పండుగ సందర్భంగా చికెన్ ధరలు మరోసారి తగ్గే అవకాశం ఉంది. వినాయక చవితికి ప్రతి ఒక్కరూ ఇంట్లో వినాయకుడిని పెట్టి పూజలు నిర్వహిస్తారు. ఆ కారణంగా చికెన్ ఎవరు ఎక్కువగా తినరు. అందువల్ల చికెన్ ధరలు వచ్చే వారంలో తగ్గుతాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.