నందమూరి ఫ్యాన్స్ లేనిదే టీడీపీ పార్టీ లేద ని సంచలన వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. మేము కన్నెర్ర చేస్తే టీడీపీ పార్టీ ఉండదు.. మేము ఓటేసి వీళ్లను గెలిపించామని వెల్లడించారు. నాలుగు గోడల మధ్య మాకు క్షమాపణలు వద్దు… ఎమ్మెల్యే బహిరంగంగా వచ్చి అందరి మద్యలో జూనియర్ ఎన్టీఆర్కు క్షమాపణలు చెప్పాలని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు బిగ్ షాక్ తగిలింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించారు ఎన్టీఆర్ అభిమానులు. శ్రీనగర్ కాలనీలో ఉన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆఫీస్ వద్దకు వచ్చారు అభిమానులు.
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలన్న అభిమానులు డిమాండ్ చేశారు. అటు ఎన్టీఆర్ అభిమానులను అడ్డుకున్నారు పోలీసులు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ లేరని కార్యాలయ సిబ్బంది చెప్పడంతో ఆఫీస్ ముందు బైఠాయించారు ఎన్టీఆర్ అభిమానులు.
నందమూరి ఫ్యాన్స్ లేనిదే టీడీపీ పార్టీ లేదు
మేము కన్నెర్ర చేస్తే టీడీపీ పార్టీ ఉండదు.. మేము ఓటేసి వీళ్లను గెలిపించాం
నాలుగు గోడల మధ్య మాకు క్షమాపణలు వద్దు
ఎమ్మెల్యే బహిరంగంగా వచ్చి అందరి మద్యలో జూనియర్ ఎన్టీఆర్కు క్షమాపణలు చెప్పాలని అభిమానుల ఆగ్రహం https://t.co/11L2ZF2CeN pic.twitter.com/hn3YMx6jlb
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025