కాళేశ్వరం మోటార్లు 2, 3 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు.. ఇదో కుట్రనే అని మండిపడ్డారు హరీష్ రావు. కాళేశ్వరం మోటర్లను నాశనం చేసేందుకు కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేశారు. మోటార్లను తరచూ ఆన్ చేస్తున్నారు ఆఫ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మోటార్ల పనితీరు దెబ్బతింటుందని BHEL కంపెనీ ఇదివరకే హెచ్చరించింది. ఇంజనీరింగ్ నిపుణులను అడిగి అసలు విషయం తెలుసుకోండి. మోటార్లను నాశనం చేసి ఆ నిందెను బీఆర్ఎస్ పార్టీపై వేయాలని కుట్రలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.

ఇప్పటికైనా నిరంతరాయంగా పంపింగ్ చేపట్టి రిజర్వాయర్లను నింపాలని హరీష్ రావు అన్నారు. ఇదిలా ఉండగా… గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం సరిగ్గా లేదని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మూడు పిల్లర్లు కుంగాయి. ఆ విషయంలో రేవంత్ రెడ్డి మాజీ CM కేసీఆర్ ను ఎన్నో మాటలు అన్నారు. అయితే వాటిని రిపేర్ చేయించకుండా సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వహిస్తున్నారని హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు వాడుకొని నీటిని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.