నటుడు నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించిన ఈ హీరో విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నాడు. వయసు పైబడినప్పటికీ నాగార్జున సినిమాలలో హీరోగా నటించడం విశేషం. ఇదిలా ఉండగా…. నాగార్జున తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

సినిమాలలో అవకాశాల కోసం మణిరత్నం వెంటపడ్డానని నాగార్జున అన్నారు. మణిరత్నం తెరకెక్కించే సినిమా కథలకు తాను సరిపోతానని భావించి అతని వెంట పడేవాడినని నాగార్జున అన్నారు. అలా మా కాంబినేషన్లో వచ్చిన సినిమా గీతాంజలి. ఈ సినిమా ఎంతో పెద్ద విజయాన్ని సాధించింది. సినిమాలలో నాగేశ్వరరావు వారసుడిగా ఆరేడు సినిమాలు చేశాను. ఇది కొంతమందికి నచ్చింది మరి కొంతమందికి అసలు నచ్చలేదు. మజ్ను సినిమా నాకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా అనంతరం ఆఖరి పోరాటం సినిమాతో కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకున్నానని నాగార్జున సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం నాగార్జున పంచుకున్న ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున వరుస సినిమా షూటింగ్లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.