శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏకంగా 67 మంది ప్రయాణికులు!

-

శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. హైదరాబాద్-తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపం గుర్తించారు పైలెట్.

shamshabad
Plane makes emergency landing in Shamshabad 67 passengers on board

దీంతో అప్రమత్తమై వెంటనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. టేకాఫ్‌ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు అధికారులు. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news