కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి ముఖ్యమంత్రి కావాలని.. వేములవాడ రాజన్న భక్తులు వేడుకుంటున్నారు. ఇవాళ వేములవాడ సన్నిధిలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి శోభమ్మ.. ప్రత్యక్షమయ్యారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కొడుకు హిమాన్షుతో కలిసి కెసిఆర్ సతీమణి శోభమ్మ వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చారు.

ఈ సందర్భంగా రాజన్నకు కోడలు కూడా కట్టేశారు. అనంతరం రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక కేసీఆర్ సతీమణి శోభమ్మ రావడంతో… వేములవాడ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అయితే శోభమ్మ కనిపించడంతో కొంతమంది భక్తులు.. ఆమె దగ్గరకు వచ్చి కేసీఆర్ మళ్ళీ రావాలి అంటూ.. ఆమె దగ్గర మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మళ్లీ మా కేసీఆర్ సార్ రావాలి
వేములవాడ రాజరాజేశ్వర్వామి స్వామి దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ pic.twitter.com/hyygRXihoE
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2025