వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ నిత్యం సోషల్ మీడియాలో.. మెరుస్తూ ఉంటారు వేణు స్వామి. అయితే అలాంటి వేణు స్వామికి తాజాగా ఘోర అవమానం ఎదురైనట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. వేణు స్వామిని ఓ దేవాలయం నుంచి బయటకు వెళ్లగొట్టారట.

కామాక్షి అమ్మవారి దేవాలయం నుంచి అక్కడ ఉన్న అర్చకులు వేణు స్వామిని తరిమి వేసినట్లు.. ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ఆ వీడియోలో తమ్మి వేసినట్లే కనిపిస్తోంది. వేణు స్వామి పై ఓ అర్చకుడు సీరియస్ అయినట్లు.. వేలు పెట్టి మరి చూపిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఇక ఈ సంఘటనపై వేణు స్వామి ఇంకా స్పందించలేదు. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
వేణు స్వామిని కామాక్షి అమ్మవారి దేవాలయం నుండి అక్కడి అర్చకులు తరిమేశారు#VenuSwamypic.twitter.com/ucGGoA0w4M
— Milagro Movies (@MilagroMovies) August 20, 2025