కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి ప్రాణహిత నదుల వద్ద నుంచి వరద నీరు భారీగా రావడంతో పుష్కర ఘాట్ వద్ద 12.25 మీటర్ల ఎత్తులో పారుతూ 10.2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

అలాగే మరో రెండు గంటల్లో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పుష్కర ఘాట్ వద్ద భారీగా నీరు చేరడంతో ప్రజలు ఎవరు స్నానం చేయడం కోసం నీటిలోకి దిగవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో గత కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులలోకి అధికంగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఆస్తి నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. మరో రెండు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.