ఆయుర్వేదం వేల సంవత్సరాలుగా మన ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి తోడ్పడుతున్న సహజ శాస్త్రం. అటువంటి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన రహస్యం కుంకుమాది తైలం. ఈ తైలం కేవలం ఒక సాధారణ నూనె కాదు ఇది అనేక రకాల అద్భుతమైన మూలికల కలయికతో తయారైన ఒక దివ్య ఔషధం. ఈరోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ముఖం పైన మొటిమలు నల్ల మచ్చలు, వంటి అనేక చర్మ సమస్య లతో ఎంతోమంది బాధపడుతున్నారు అటువంటి వారికి దివ్య ఔషధం. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడమే కాక అనేక చర్మ సమస్యలు నివారిస్తుంది ఈ తైలాన్ని ఎలా వాడాలి దాని ప్రయోజనాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
కుంకుమాది తైలం : ఆయుర్వేదంలో చర్మ సంరక్షణ కోసం వాడే ఒక ముఖ్యమైన నూనె. దీని ప్రధాన పదార్థం కుంకుమపువ్వు అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కుంకుమపువ్వుతో పాటు పాలు, గంధం, పద్మకం, మంజిష్ఠ వంటి 20 కి పైగా మూలికలను ఉపయోగించి ఈ తైలాన్ని తయారు చేశారు ఈ మూలికలన్నీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

ప్రయోజనాలు : ఈ తైలం చర్మానికి సహజమైన కాంతిని మెరుపుని ఇస్తుంది దీనిలో కుంకుమ పువ్వు చర్మం రంగును మెరుగుపరిచి, చర్మాన్ని రక్షించి కొత్త కాంతిని ఇస్తుంది. ఈ తైలంలో ఉండే ఆంటీ ఇన్ఫర్మేషన్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మొటిమలను మరియు వాటి వల్ల ఏర్పడిన మచ్చలను తగ్గిస్తాయి. ఇది చర్మంపై ఏర్పడే ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.
అంతేకాక ఇది వృద్ధాప్య టైం లో వచ్చే ముడతలు, ఫైన్ లైన్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ తైలం చర్మం కణాలను పునర్జీవింపజేసి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలు తగ్గించడంలో ఈ తైలం చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.
ఎలా వాడాలి: రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి రెండు మూడు చుక్కలు కుంకుమాది తైలాన్ని చేతిలోకి తీసుకొని ముఖం, మెడ పై సున్నితంగా మసాజ్ చేయాలి. సుమారు 15 నుండి 20 నిమిషాలు మసాజ్ చేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. లేదంటే రాత్రంతా ఉంచి ఉదయం కడిగేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వాడడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహనా కోసం మాత్రమే)